న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత చాలా రోజులు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం హఠాత్తుగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దీపక్ బబారియాను గురువారం బాధ్యతల నుంచి తప్పించింది. అతని స్థానంలో సోనియాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడిన ముకుల్ వాస్నిక్‌ను నియమించింది. ముకుల్ వాస్నిక్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మధ్యప్రదేశ్ వ్యవహారాలను అప్పజెబుతూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముకుల్ వాస్నిక్ మధ్యప్రదేశ్‌తోపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర వ్యవహారాల బాధ్యులుగా కూడా కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.