సిడ్నీ: గత యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడాడు. ఆ సిరీస్‌లో మొత్తంగా 774 పరుగులు చేసి రికార్డు బ్యాటింగ్‌తో అలరించాడు. అది కూడా బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురై నేరుగా యాషెస్ సిరీస్‌లో బరిలోకి దిగిన స్మిత్ అంచనాలు మించి రాణించాడు. ఒకవైపు స్మిత్‌ను ఇంగ్లండ్ ప్రేక్షకులు హేళన చేస్తున్నా అతను మాత్రం చెదరని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. స్మిత్‌ను పదే పదే టార్గెట్ చేసి బాధ పెట్టినా అతను ఎక్కడా కూడా బెదరలేదు కదా.. అదరగొట్టేశాడు. కాగా, యాషెస్ సిరీస్‌లోనే స్టీవ్ స్మిత్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. రెండో టెస్టులో 148 కిలోమీటర్ల వేగంతో ఆర్చర్ వేసిన ఓ బౌన్సర్ నేరుగా స్మిత్ తలకు తాకింది.( 'స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా సరైనోడు కాదు')
ఫిల్ హ్యూస్‌లా కాకూడదని ప్రార్థించాం: వార్నర్