టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన పెళ్లిపై వస్తున్న వదంతులపై స్పందించారు. కరోనా కారణంగా అతని పెళ్లి వాయిదా పడిందనే వార్తలను ఖండించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. నా పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం అంటూ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: రానా ‘అరణ్య’ విడుదల వాయిదా
'కరోనానే కాదు నా పెళ్లిని ఎవరూ ఆపలేరు': హీరో